ప్రజ-పద్యం ఫేస్ బుక్ గ్రూప్ వారు నిర్వహించిన సామాజిక పద్య రచన పోటీ కొరకు 26-09-2017 న వ్రాసిన పద్యములు.
పద్య పక్షం - 11
“టీవీ సీరియళ్ళు-సమాజంపై ప్రభావం ”
కం:
సీర్యలు జూచెడి వేళల
భార్యను పిలువంగజూచు భర్తను గనుచున్
మర్యాదగ జెప్పరులే
మిర్యాలను నూరుదురిక మీదను వినరా!
ఆ.వె:
చుట్టములునురాగ జూడరే యొకకంట
నొక్కకంట జూచు చుంద్రు టీవి
మాటలాడ బోరు మంచిగానొకగంట
ముచ్చటాడ"బోరు" మోముద్రిప్పు.
సీ:
అత్త కోరుచునుండు నాభక్తి, ఈటీవి
కోడలేమొ గనును కోరి జెమిని
మామజూచునుగాద మాటీవి, జీటీవి
భర్త గోరుచునుండు వార్తలన్ని
పెద్దవాడిదిగోల ప్రియమైన స్పోర్ట్సుకై
చిన్న దానికి బ్రీతి జెమిని సినిమ
పిల్లవాడలుగును పెట్టగా కార్టూన్లు
ఛార్లిచాప్లిననుచు చంటిదడుగు
ఆ.వె:
వారుబెట్టవీరు, వీరుబెట్టగవారు
మార్చమంద్రు కోపమందుకొనుచు
బుల్లితెరయె వచ్చి ముచ్చట్ల బోగొట్టె
పెట్టె తంపులెన్నొ "పిచ్చి పెట్టె."
కం:
రంగులలో జూపు పలుతె
రంగుల గొడవలనురేపు, రమణీ మణులన్
రంగులమార్చెడి 'విలనుల '
రంగులు మారగ గనుదురు రంజుగ ప్రీతిన్.
చం:
కలవరమేలలే వలదు, కన్నులనిండుగ 'టీవి 'జూడగా
విలువలు దెల్పునట్టివియు, విజ్ఞత నేర్పెడు కొన్ని భాగముల్
కలవులె మంచివేయనుచు గానఁగ మెచ్చెడువైన, నుండెలే
కళలను నేర్పునట్టివియు, కమ్మని భక్తిని పెంచు నట్టివే.
పద్య పక్షం - 11
“టీవీ సీరియళ్ళు-సమాజంపై ప్రభావం ”
కం:
సీర్యలు జూచెడి వేళల
భార్యను పిలువంగజూచు భర్తను గనుచున్
మర్యాదగ జెప్పరులే
మిర్యాలను నూరుదురిక మీదను వినరా!
ఆ.వె:
చుట్టములునురాగ జూడరే యొకకంట
నొక్కకంట జూచు చుంద్రు టీవి
మాటలాడ బోరు మంచిగానొకగంట
ముచ్చటాడ"బోరు" మోముద్రిప్పు.
సీ:
అత్త కోరుచునుండు నాభక్తి, ఈటీవి
కోడలేమొ గనును కోరి జెమిని
మామజూచునుగాద మాటీవి, జీటీవి
భర్త గోరుచునుండు వార్తలన్ని
పెద్దవాడిదిగోల ప్రియమైన స్పోర్ట్సుకై
చిన్న దానికి బ్రీతి జెమిని సినిమ
పిల్లవాడలుగును పెట్టగా కార్టూన్లు
ఛార్లిచాప్లిననుచు చంటిదడుగు
ఆ.వె:
వారుబెట్టవీరు, వీరుబెట్టగవారు
మార్చమంద్రు కోపమందుకొనుచు
బుల్లితెరయె వచ్చి ముచ్చట్ల బోగొట్టె
పెట్టె తంపులెన్నొ "పిచ్చి పెట్టె."
కం:
రంగులలో జూపు పలుతె
రంగుల గొడవలనురేపు, రమణీ మణులన్
రంగులమార్చెడి 'విలనుల '
రంగులు మారగ గనుదురు రంజుగ ప్రీతిన్.
చం:
కలవరమేలలే వలదు, కన్నులనిండుగ 'టీవి 'జూడగా
విలువలు దెల్పునట్టివియు, విజ్ఞత నేర్పెడు కొన్ని భాగముల్
కలవులె మంచివేయనుచు గానఁగ మెచ్చెడువైన, నుండెలే
కళలను నేర్పునట్టివియు, కమ్మని భక్తిని పెంచు నట్టివే.
No comments:
Post a Comment