శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 01 - 2016 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - హృద్రోగమె మేలు సేయు నెల్లజనులకున్.
కందము:
భద్రముగా యోగాసన
ముద్రలనే నేర్చి విష్ణు మూర్తిని మదిలో
చిద్రూపు దలప - రాదుగ
హృద్రోగమె - మేలు సేయు నెల్లజనులకున్.
కందము:
భద్రముగా యోగాసన
ముద్రలనే నేర్చి జేయు ముపపథ్యమునే
ఛిద్రము గాదుగ, రాదుగ
హృద్రోగమె - మేలు సేయు నెల్లజనులకున్.
సమస్యకు నా పూరణ.
సమస్య - హృద్రోగమె మేలు సేయు నెల్లజనులకున్.
కందము:
భద్రముగా యోగాసన
ముద్రలనే నేర్చి విష్ణు మూర్తిని మదిలో
చిద్రూపు దలప - రాదుగ
హృద్రోగమె - మేలు సేయు నెల్లజనులకున్.
కందము:
భద్రముగా యోగాసన
ముద్రలనే నేర్చి జేయు ముపపథ్యమునే
ఛిద్రము గాదుగ, రాదుగ
హృద్రోగమె - మేలు సేయు నెల్లజనులకున్.
No comments:
Post a Comment