శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 12 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - చనుబాలను తండ్రి తీయ సంతసమందెన్.
కందము:
పెనుకేకలనూయలనే
తనకాలిని తన్నియేడ్వ తల్లియె స్నాన
మ్మునకేగగ వడినాడిం
చను, బాలను తండ్రి తీయ సంతసమందెన్.
కందము:
వినకను నిద్రను బొమ్మన
తననెత్తుక బొమ్మననుచు తండ్రిని గోరన్
వెనువెంట బయట నాడిం
చను, బాలను తండ్రి తీయ సంతసమందెన్
సమస్యకు నా పూరణ.
సమస్య - చనుబాలను తండ్రి తీయ సంతసమందెన్.
కందము:
పెనుకేకలనూయలనే
తనకాలిని తన్నియేడ్వ తల్లియె స్నాన
మ్మునకేగగ వడినాడిం
చను, బాలను తండ్రి తీయ సంతసమందెన్.
కందము:
వినకను నిద్రను బొమ్మన
తననెత్తుక బొమ్మననుచు తండ్రిని గోరన్
వెనువెంట బయట నాడిం
చను, బాలను తండ్రి తీయ సంతసమందెన్
No comments:
Post a Comment