శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 - 06 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా
ఉత్పలమాల:
" కోతులు, చాకొ బారులని " కొంటెగ బిల్తురు పాఠశాలలో
ప్రీతియె బిల్వగా తరలి పెండ్లికి వచ్చుచు మిత్రబృందమే
ప్రీతిగ తెచ్చినారు తమ' ఫ్రెండ్షిపు ' గుర్తుగ వారితోడ " చా
కో " తిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా.
No comments:
Post a Comment