శ్రీ కందిశంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 05 - 2015 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - కాలికి ముల్లు గ్రుచ్చినది కావలె గొడ్డలి దానిఁ దీయఁగన్.
ఉత్పలమాల:
మేలుగ పూలమొక్కలను మెచ్చగ బెంచితి నింటి తోటలో
మూలలు మూలలున్ దిరిగి మొక్కల నీటిని పోయగా నటన్
కాలునివోలె మొల్చినది కాండము లావయె తుమ్మ మొక్కయే
కాలికి ముల్లు గ్రుచ్చినది, కావలె గొడ్డలి దానిఁ దీయఁగన్.

No comments:
Post a Comment