తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday 31 March 2016

శారీ మందిర్


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  06 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

`


వర్ణ (న) చిత్రం - శారీ మందిర్ 




















కందము: 
శారీలను చూడుడు ప్రతి 
సారీ కొంగ్రొత్త సరుకు సందడి చేయున్ 
సారించుడు చూపుల, వే 
సారీ విసుగింత మాకు చచ్చిన రాదే !

Wednesday 30 March 2016

సరళాక్షరము(గ-జ-డ-ద-బ)లను ఉపయోగించకుండా గాంధీజీ స్తుతి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  02 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



నిషిద్ధాక్షరి - సరళాక్షరము(గ-జ-డ-ద-బ)లను ఉపయోగించకుండా గాంధీజీ స్తుతి 



ఆటవెలది: 
చేతకర్ర పట్టి చిన్ని కొల్లాయిని 
కట్టి తెల్లవారి కాళ్ళు విరిచె 
శాత్యహింస నేర్పి చక్కని స్వేచ్ఛను 
మనకునిచ్చి  నిలిచె మహిని తాత. 
  

Tuesday 29 March 2016

పదవీవిరమణము గొప్ప వర మగును గదా

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  01 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - పదవీవిరమణము గొప్ప వర మగును గదా



కందము: 
పదవిని కుదరని పనులను 
ముదిమిని సమయమ్ము దొరుక ముచ్చట బడుచున్ 
కుదురుగ జేసెడి వారికి 
పదవీవిరమణము గొప్ప వర మగును గదా!

Monday 28 March 2016

కలుగున దూరిన

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  01 - 10 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - కలుగున దూరిన  











కందము: 
కలుగున దూరినదనుచును 
ఎలుకను పట్టంగ నోర్పు నిటు నిలచితివే 
కలుగును దానికి దారులు 
పలువిధములు లోన నింక పదవే పిల్లీ !

Sunday 27 March 2016

కాకి - కోయిల - బాతు - నెమలి...భారతార్థంలో

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  30 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది: కాకి - కోయిల - బాతు - నెమలి...భారతార్థంలో


కందము: 
నాకా కినుకయె వచ్చెను 
మాకో యిలఖండ మెంత మాధవ ! యొడలే  
నాకాయెనె మలినంబిక 
నాకురుతతి 'బొందబాతు' నయముగ కృష్ణా !

Saturday 26 March 2016

బ్రహ్మ కడిగిన పాదమున్ బట్ట రాదు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  29 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




సమస్య - బ్రహ్మ కడిగిన పాదమున్ బట్ట రాదు.




తేటగీతి: 
పాపపంకిల మున్నట్టి బాధ మనకు 
గంగ పుట్టిన పాదమున్ కడుగ - రాదు 
భవము బంధాల గొడవేది ప్రస్తుతించి 
బ్రహ్మ కడిగిన పాదమున్ బట్ట - రాదు.

Friday 25 March 2016

వెంటబడి జంపువాడె పో ప్రియసఖుండు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  27 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - వెంటబడి జంపువాడె పో ప్రియసఖుండు.



తేటగీతి:  
కలికి మోమది పూవని కందునట్లు 
తేటి వ్రాలుచు రెక్కల మీటగాను 
భయము జెంద జలజముఖి, పట్టి తేటి 
వెంటబడి జంపువాడె పో ప్రియసఖుండు.

Thursday 24 March 2016

సింగారం

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  27 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - సింగారం 













కందము: 
అద్దము తానే నిన్నిక
వద్దని పోపొమ్మటంచు పలుకకముందే
ముద్దుల పతియే పిలువగ
నొద్దికగా వెడలుమమ్మ నొప్పింపకయే.

Wednesday 23 March 2016

అనుస్వారాన్ని ఉపయోగించకుండా పెండ్లి విందును గురించి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  26 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



నిషిద్ధాక్షరి - అనుస్వారాన్ని ఉపయోగించకుండా
పెండ్లి విందును గురించి


కందము: 
సరి మనువున భోజనమిది 
యరిటాకుల లోనవేడి యన్నము పప్పున్ 
మరి గాచిననేయి, వడలు 
నరిసెలు రసమప్పడ వడియము పాయసమే. 

Tuesday 22 March 2016

ఈతాకుల గుడిసె లోన నినుఁ డుదయించెన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  25 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - ఈతాకుల గుడిసె లోన నినుఁ డుదయించెన్. 


కందము: 
ప్రీతిగ కొలిచెను సూర్యుని 
మాతమ్మే పుత్రు కొరకు మరి పుట్టగనే 
ఆతనికి పేరు పెట్టెను 
ఈతాకుల గుడిసె లోన "నినుఁ డు"దయించెన్.

Monday 21 March 2016

" తల " పదం నాలుగు పాదాలలో

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  24 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది - " తల " పదం నాలుగు పాదాలలో వచ్చేట్లు పూదోటను వర్ణించాలి. 

కందము: 
పూతల పూవుల తోటను 
భూతలమున పెంచుడయ్య, పోయగ నీరున్ 
రోతల దుస్థితి మాపును
చేతల, తల సున్నితమగు చేష్టలు గలుగున్. 

Sunday 20 March 2016

కోడి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  24 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - కోడి 












కందము: 
గుడిసెలపై మేల్కొలుపుగ 
కుడిచెడు వారికి చికెనుగ, గ్రుడ్లనొసగుచున్  
బడసెడు వ్యాపారమ్ముగ 
నడచెడు నీవన్న ప్రేమ నరునకు కోడీ !

Saturday 19 March 2016

వంకాయలు.



శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  22 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - వంకాయలు. 

















కందము: 
వంకాయలు తిప్పుచు నలు 
వంకల నేపుచ్చులేక పరికించవలెన్ 
వంకాయలెట్లు వండిన 
వంకలులేకుండ నుండు 'వాహ్' యను రుచితో. 

Friday 18 March 2016

తల్లికి ముక్కు కోసి పిన తల్లికి ముక్కెర పెట్ట మేలగున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  21 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - తల్లికి ముక్కు కోసి పిన తల్లికి ముక్కెర పెట్ట మేలగున్. 


ఉత్పలమాల: 
తల్లియె తెల్గుభాష పినతల్లియె చూడగ నాంగ్ల, మాంధ్రుడా !
తల్లికి ముక్కు కోసి పిన తల్లికి ముక్కెర పెట్టినావుగా !
చెల్లదు పుత్ర ! దోషమది - చేకొని నాసికనుంచి చక్కగా  
తల్లికి - ముక్కు కోసి పిన తల్లికి - ముక్కెర పెట్ట మేలగున్.  

Thursday 17 March 2016

పాప ఱేడు


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  21 - 09 - 2014 న ఇచ్చిన

సమస్యకు నా పూరణ.

వర్ణ (న ) చిత్రం - పాప ఱేడు 





తేటగీతి: 
పాపడట్టుల నిద్రించ పరుపు పైన 
పడక పైనెక్కె చూడుడా పాపరేడు 
పడగ పట్టగ వచ్చెనా పాపపైన ? 
పట్టినట్లైన మున్ముందు పాప ఱేడు !




Wednesday 16 March 2016

శ, ష, స, హ అక్షరాలను ఉపయోగించకుండా సతీసావిత్రి పాతివ్రత్యాన్ని వర్ణించాలి.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  20 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



నిషిద్ధాక్షరి - శ, ష, స, హ అక్షరాలను ఉపయోగించకుండా
సతీసావిత్రి పాతివ్రత్యాన్ని వర్ణించాలి. 



కందము: 
పతినే పట్టుకు పోవగ
బ్రతుకే తిరిగిచ్చు వరకు ప్రక్కకు పోకన్ 
మతితోడనె యముని గెలిచి 
క్షితిలోననె నిలిచె, పేరు చెప్పకె తెలియున్. 

Tuesday 15 March 2016

ఓటమి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  19 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణన - ఓటమి


కందము: 
తిట్టకు మోటమినెప్పుడు 
మెట్టది విజయమ్ము జేర, మీదకు జనుచున్ 
నెట్టుము వెనుకకు దానిని 
ముట్టెదవిక జయము నీవు ముచ్చటగానే. 

Monday 14 March 2016

అల - కల - తల - వల

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  18 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



దత్తపది: అల - కల - తల - వల

రావణుని చెరలో సీత మనోగతం. 

కందము: 
అల లంకను రాక్షస వని
తలు చుట్టుననున్న సీత తలపులలోనన్ 
కలవరమందక రాముని 
వలపులనే తలచుచుండె వచ్చెడి వరకున్. 

Sunday 13 March 2016

స్త్రీలకు స్వాతంత్ర్య మొసఁగఁ జెల్లదు ధరపై

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  13 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - స్త్రీలకు స్వాతంత్ర్య మొసఁగఁ జెల్లదు ధరపై




కందము: 
పూలతల వంటి వనితలు
కేలెత్తియు వేసినారు కేకలు సభలో
ఏలాగు మనువ ? ఎందుకు
" స్త్రీలకు స్వాతంత్ర్య మొసఁగఁ జెల్లదు ధరపై ? "  


కందము: 
గోలనువిని మనువరచెను
శ్రీలను పూయించు మీకు చెడు తొలగుటకై
ఓలలన లార జెప్పితి
" స్త్రీలకు స్వాతంత్ర్య మొసఁగఁ జెల్లదు ధరపై " 


కందము: 
నేల పునాదుల నుండియు 
నేలాగున నిల్లు గట్ట నేర్చినవారిన్ 
మేలుగ నుంచుము, చిరు మే 
స్త్రీలకు స్వాతంత్ర్య మొసఁగఁ జెల్లదు ధరపై.   

Saturday 12 March 2016

చింత - నిమ్మ - మామిడి - వెలగ

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  12 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది: చింత - నిమ్మ - మామిడి - వెలగ 

ద్రౌపది కీచకుని అధిక్షేపించడం  


తేటగీతి: 
వెలగబెట్టగ చూచితి తెలివి నీది 
మడియగలవిక మానుమా మిడిసి పాటు 
భర్తలేవురు నిమ్మహి భయములేక 
నన్నుగాతురు చింతయే నాకులేదు.

Friday 11 March 2016

కవర్గాక్షరము ఉపయోగించకుండా కైకేయి వ్యక్తిత్వం

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  08 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




నిషేధాక్షరి: కవర్గాక్షరము (క-ఖ-గ-ఘ-ఙ)లను ఉపయోగించకుండా
కైకేయి వ్యక్తిత్వాన్ని వర్ణించాలి. 




తేటగీతి: 
భరతు రాజును జేయ దా దలచెనేమొ
మరియు మంధర మాట యేమార్చెనేమొ 
ధరను భారమ్ము దగ్గించ తట్టెనేమొ 
పంపె పినతల్లి రాముని వనముజేర.

Thursday 10 March 2016

నిమజ్జనము

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  08 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణ (న) చిత్రం - నిమజ్జనము








తేటగీతి: 
మట్టిలోనుండి పుట్టగ మహిమజూపి 
పూజలందిన కడు పుణ్య పురుషుడైన 
కడకు ప్రకృతిని తప్పక కలియుననుచు 
జనమునకు జెప్పు నీ నిమజ్జనము జూడ

Wednesday 9 March 2016

కవిత లల్లకున్న గలుగు సుఖము.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  07 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - కవిత లల్లకున్న గలుగు సుఖము.



ఆటవెలది: 
కలికి గొణుగుచుండె కంఠమ్ము తగ్గించి 
కూర తెమ్మనంటి దూరదేమి 
కదలరెపుడు జూడ కంప్యూటరే ? పిచ్చి 
కవిత లల్లకున్న గలుగు సుఖము.

Tuesday 8 March 2016

దత్తపది: సుయోధనుఁడు - దుశ్శాసనుఁడు - కర్ణుఁడు - శకుని, రామాయణార్థంలో

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  06 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


దత్తపది: సుయోధనుఁడు - దుశ్శాసనుఁడు - కర్ణుఁడు - శకుని, రామాయణార్థంలో


శ్రీ రాముని గురించి రావణుని తలంపు...

తేటగీతి: 
అనగ దుశ్శాసనుడనౌచు ననికి బంప 
కుంభకర్ణుఁడు విలుధాటి గూలినాడు 
మనసు యోధనుఁడనియెడు మాట మెదిలె 
నాదు యాశకు నిప్పులనతడు బోసె. 

Monday 7 March 2016

శివగుణమ్ములు నీవద్ద చిత్రమవియె

ఓం నమః  శివాయ   

మీకు అందరికీ మహేశ్వరానుగ్రహము కలుగుగాక. 
















సీసము: 
ఒక్క కంటనె నిప్పు చక్కగా నీకుండు 
మాకురెండు కనుల మంటలుండు 
కామునొక్కని బట్టి కాల్చివేసితివీవు 
మమ్మునమ్మెడువాడు  మసియె యగును 
విషము కంఠమందు వెలసియుండును నీకు 
కాయమంతయు  మాకు గరళముండు 
నందివాహనమొండు నమరియుండును నీకు 
ఎద్దు మించును బుద్ధి నెన్న మాకు 

తేటగీతి:   
శివగుణమ్ములు నీవద్ద చిత్రమవియె
అవగుణమ్ములు మాకవి యనెడు మమ్ము 
మందబుద్ధుల దీవించ మదిని గొలుతు 
తలలు మార్చెడు వాడ ! మా తలపు మార. 




 




Sunday 6 March 2016

గురునకుఁ బంగనామముల గుట్టుగఁ బెట్టెడి శిష్యు లుత్తముల్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  05 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - గురునకుఁ బంగనామముల గుట్టుగఁ బెట్టెడి శిష్యు లుత్తముల్. 


చంపకమాల: 
గురువును నేనె సాధకులు గుంపుగ రండని బోధసేయుచున్ 
మరుగున రాత్రివేళలను మారుని కేళికి శిష్యురాండ్రనే 
సరగున బిల్చు వారికిని శాస్తిని జేయ రహస్య చిత్రణన్ 
గురునకుఁ బంగనామముల గుట్టుగఁ బెట్టెడి శిష్యు లుత్తముల్.

Saturday 5 March 2016

బడిపంతులు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  05 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణన - బడిపంతులు. 


కందము: 
బడియే విద్యార్థులకిల
గుడియగునట గురువుగారు కుల దైవమ్మౌ   
బడిపంతులు తనకే కన
బడినంతనె దైవమైన వందనమిడుగా!

Friday 4 March 2016

గురువులు లేని గణపతి స్తుతి

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  02 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.




వర్ణన - గురువులు లేని గణపతి స్తుతి




ఆటవెలది: 
శివుని యురగము గన జిరుభయము గలుగ 
నగపు పడతి పొదివి నదుము కొనగ
నగుచు కరము దులిపి యగమును తగిలెడి
కరివదనుని మదిని గనుచు గొలుతు.

Thursday 3 March 2016

చెడు కాలమె జనుల కెపుడు సేమముఁ గూర్చున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  01 - 09 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - చెడు కాలమె జనుల కెపుడు సేమముఁ గూర్చున్.



కందము: 
ముడిగట్టి నల్ల ధనమును 
పడవేసిరి స్విస్సు బ్యాంకు, పట్టగ దానిన్ 
ముడిబడ జేయగ భావిం
చెడు కాలమె జనుల కెపుడు సేమముఁ గూర్చున్

Wednesday 2 March 2016

కరి - గురి - దరి - విరి...భారతార్థంలో.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  31 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



దత్తపది - కరి - గురి - దరి - విరి...భారతార్థంలో.



కందము: 
కరివరదు కృష్ణు దలచుచు 
దరిజేకొని విల్లునెత్తి తానర్జునుడే 
గురిజూచి కొట్టె చేపను 
విరిమాలను వేసె కృష్ణ వేడుక గలుగన్.

Tuesday 1 March 2016

ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  30 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్.



కందము: 
వినయముతో గురు సేవయు  
ననయము తలిదండ్రి సేవ లతిథుల సేవల్ 
చనధర్మ పథము, తగు సా 
ధనమొక్కటె మోక్షమిచ్చు దారిగఁ దలఁతున్.