శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 - 08 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - శ్రీకృష్ణుని మేనమామ శిశుపాలుండే.
కందము:
"ఈ కోటి మీది" ప్రోగ్రాం
శ్రీకరరావడిగె ప్రశ్న శేషాచారిన్
ఓకే యని చారిటులనె
శ్రీకృష్ణుని మేనమామ శిశుపాలుండే.
దొందూదొందే....
కందము:
శ్రీకృష్ణారావు చెప్పెను
శ్రీకృష్ణుని కన్నతల్లి రేవతి గాదే !
శ్రీకృష్ణ మూర్తి చెప్పెను
శ్రీకృష్ణుని మేనమామ శిశుపాలుండే!
సమస్యకు నా పూరణ.
సమస్య - శ్రీకృష్ణుని మేనమామ శిశుపాలుండే.
కందము:
"ఈ కోటి మీది" ప్రోగ్రాం
శ్రీకరరావడిగె ప్రశ్న శేషాచారిన్
ఓకే యని చారిటులనె
శ్రీకృష్ణుని మేనమామ శిశుపాలుండే.
దొందూదొందే....
కందము:
శ్రీకృష్ణారావు చెప్పెను
శ్రీకృష్ణుని కన్నతల్లి రేవతి గాదే !
శ్రీకృష్ణ మూర్తి చెప్పెను
శ్రీకృష్ణుని మేనమామ శిశుపాలుండే!
No comments:
Post a Comment