శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 08 - 2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
వర్ణ (న) చిత్రం - అశ్వత్థామ పరాభవము
తేటగీతి:
నిదుర నున్నట్టి పిల్లల నీచ వృత్తి
గొంతు గోసిన వీడటే గురు సుతుండు
ఉత్తరించెద నిప్పుడే కుత్తుకనగ
వలదు వలదను పాంచాలి వందనీయ.
No comments:
Post a Comment