తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday 24 July 2013

దశరథుఁడే వనులకేగెఁ దపసులు మెచ్చన్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-06-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - దశరథుఁడే వనులకేగెఁ దపసులు మెచ్చన్.

కందం:
దశదిశల ఖ్యాతిగాంచిన
యశమును గన్నట్టి పుత్రు డారఘు రామున్
కుశలము నెంచక గోరగ
దశరథుఁడే, వనులకేగెఁ దపసులు మెచ్చన్.

No comments: