తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday 1 July 2013

తినుచో తియ్యని వేపగింజ మదిలో దీపించు సద్యోగముల్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27-05-2012 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.

సమస్య - తినుచో తియ్యని వేపగింజ మదిలో దీపించు సద్యోగముల్.

మత్తేభము: 
వినుమా చూడగ నోట బెట్టి నమలన్ వేపాకు చేదౌనుగా
తినగా మారును మారు మారు నదియే తీపెక్కు నట్లే భువిన్
మనుజుండెప్పుడు కష్టమైన పనులన్ మార్మారు చేపట్టగా
'తినుచో తియ్యని వేపగింజ' మదిలో దీపించు సద్యోగముల్.



No comments: