శ్రీ చింతా రామకృష్ణారావు గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 25-01-2013 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - హర్మ్యము లోన సంచరిలె హాయిగ పార్వతి విష్ణుమూర్తితో
ఇసుకతో పెద్ద పెద్ద సైకత శిల్పములు చేయుట చూస్తున్నాం. అలాగే మంచు తో గణపతి, కుమారస్వామి ఆడుకుంటూ ముచ్చటగా చేసిన హర్మ్యమును చూడటానికి హరి కైలాసానికి వచ్చినట్లు భావించాను.
ఉత్పలమాల:
హర్మ్యము మంచు కొండ మదనారికి జూడగ వెండి కొండపై
హర్మ్యము జేసి మంచునట నాడుచునుండగ స్కందు డన్నయున్
హర్మ్యము జూడ వచ్చె నుమ కన్నయ, సంతసమంది శంభుడే
హర్మ్యము లోన సంచరిలె హాయిగ పార్వతి విష్ణుమూర్తితో.

No comments:
Post a Comment