శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ
సమస్య - విఱుగఁ బండిన చేలను విడువఁ దగును.
టమాట పంట కోసినా కొనేవారు లేక, కోసిన కూలి కూడా రాక రోడ్డు మీద పారబోసిన సంఘటనలు ఎన్నో...
తేటగీతి:
రామములగలు కాసెను గ్రామమందు
కోయు వారికి కావలె వేయి, వాని
కొనెడు వారలు జూడగ కనరు గాన
విఱుగఁ బండిన చేలను విడువఁ దగును.
తేటగీతి:
వాన పెల్లయి గట్టి తుఫాను వచ్చి
చెరువు కట్టలు తెగిపడి చేలలోన
నీరు నిండిన రైతు కన్నీరు తోడ
విఱుగఁ బండిన చేలను విడువఁ దగును.
సమస్య - విఱుగఁ బండిన చేలను విడువఁ దగును.
టమాట పంట కోసినా కొనేవారు లేక, కోసిన కూలి కూడా రాక రోడ్డు మీద పారబోసిన సంఘటనలు ఎన్నో...
తేటగీతి:
రామములగలు కాసెను గ్రామమందు
కోయు వారికి కావలె వేయి, వాని
కొనెడు వారలు జూడగ కనరు గాన
విఱుగఁ బండిన చేలను విడువఁ దగును.
తేటగీతి:
వాన పెల్లయి గట్టి తుఫాను వచ్చి
చెరువు కట్టలు తెగిపడి చేలలోన
నీరు నిండిన రైతు కన్నీరు తోడ
విఱుగఁ బండిన చేలను విడువఁ దగును.
No comments:
Post a Comment