తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday 11 January 2013

సంగీతము విన్నవారు చచ్చిరి త్రుటిలో.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12-01-2012 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - సంగీతము విన్నవారు చచ్చిరి త్రుటిలో.

శంకరాభరణం చిత్రం లో శంకరశాస్త్రిని ఏర్యల్  శాస్త్రి అని గేలి చేసినవారు శంకర శాస్త్రి పాడినసంగతులు పలుక లేక బిక్క చచ్చి పోయిన సందర్భం....

కందము:
ఎంగిలి పాటల ' సింగరు '
లింగితమును మాని తిట్టి 'రేర్యల్ శాస్త్రిన్'
సంగతులు రాక 'శంకర
సంగీతము' విన్నవారు చచ్చిరి త్రుటిలో.

2 comments:

voleti said...

లెస్స పలికితిరి... భేష్ ....

గోలి హనుమచ్చాస్త్రి said...

వోలేటి గారూ ! స్వాగతం. మెచ్చుకోలుకు ధన్యవాదములు...