తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday 25 November 2012

పనిపాటులు లేనివాఁడె పద్యము లల్లున్.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-11-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ

సమస్య - పనిపాటులు లేనివాఁడె పద్యము లల్లున్.

కందము:
వినరా మంచము నల్లెద
మనగా నే పద్య మొకటె యల్లెద నంటిన్ 
విని మాబావయె యనెనిటు
పనిపాటులు లేనివాఁడె పద్యము లల్లున్.

2 comments:

బుల్లబ్బాయ్ said...

తెలుగు బ్లాగు చర్చలు
తెరిచి చూచిన చాలు, పూరణములే యాన్ని
దారుణములే! కారణమ్ములేమన,
పనిపాటులు లేనివాఁడె పద్యము లల్లున్

(గురువు గారు, చందస్సులు స్కూల్రోజుల్లోనే గుంటదీసిగంటవాయించా.. యేదో కామెడీకి ఇట్టా రశా.. యేమనుకోకండి.)

గోలి హనుమచ్చాస్త్రి said...

బుల్లబ్బాయి గారూ ! మీరు 'బుల్లబ్బాయ్' కదా ... ఏమీ అనుకోనులెండి. బ్లాగును వీక్షించి వ్యాఖ్యానించి నందులకు ధన్యవాదములు.