శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04-09-2011 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - మోదక మన్న సుంతయును మోదము లేదు
గణాధినాధుకున్.
ఉత్పలమాల:
ఖేదము బోవ భక్తులట , కీర్తన జేయుచు మోద మందగా
మోదక మన్న ప్రేతిగల మూషిక వాహను పూజ జేసి య
మ్మో! దరి నేదొ చెర్వులను ముంచగ, ముక్కులు మూయు నట్టి 'ఖ
ర్మోదక' మన్న సుంతయును మోదము లేదు గణాధినాధుకున్.
No comments:
Post a Comment