శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 31-08-2011 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.
సమస్య - రంజానుకు చేయవలయు రాముని భజనల్.
కందము:
అంజనకుమారి, అహ్మద్
రంజని మరి షేక్ సలీము 'లవ్లీ సన్లే'
'ఎంజాయ్' చేయుచు నమాజు
రంజానుకు చేయవలయు రాముని భజనల్.
రంజాన్ అయినా ఏ రోజు అయినా వారి వారి ఇష్ట
దైవాలను పూజించాలని నా భావం ..
కందము:
రంజానుకు జాన్ ' ప్రేయర్'
రంజానుకు మరి నమాజు లాలహ్మద్ లే
అంజన కుమార చౌదరి
రంజానుకు చేయవలయు రాముని భజనల్.
No comments:
Post a Comment