తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday 30 July 2012

నీతికి చెరసాలె నేఁడు నేస్తం బయ్యెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 20-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య -  నీతికి చెరసాలె నేఁడు నేస్తం బయ్యెన్

కందము:
ప్రీతిగ మోసము జేయుచు
మేతను మేయుచు ధనమును మేటలు వేసే
నేతల హైటెక్కుల యవి
నీతికి చెరసాలె నేఁడు నేస్తం బయ్యెన్.

2 comments:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు said...

కవి మిత్రమా మీ పద్యము చాలా బాగుంది.

గోలి హనుమచ్చాస్త్రి said...

సహదేవుడు గారూ! ధన్యవాదములు.