తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday 28 July 2012

దత్తపది - "కొమ్మ, ఆకు, కాయ, పండు" పదాలను ఆయా అర్థాలలో కాకుండా



శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 17-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

దత్తపది - "కొమ్మ, ఆకు, కాయ, పండు"  పదాలను ఆయా అర్థాలలో కాకుండా ఉపయోగించి
మహాభారతార్థంలో..

మయసభ నుండి అవమానము తో వచ్చిన రారాజు మనస్థితి...
తేటగీతి:
ఆ కులట కృష్ణ మదమెక్కి యచట నవ్వె
కాయమున గాదు మనసు గాయ మయ్యె
పండుకొన్నను నిద్దుర పట్ట దాయె
కొమ్మ పొగరును దించగా కోరె మనసు .

1 comment:

Anonymous said...

chala bagundi dattapadi purana...you are great in spontaniously secting the ideas..i liker that instinct...srinivas.