శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
ఆటవెలది:
సమస్య - కప్పులోనఁ బుట్టె గద తుఫాను.
ఆటవెలది:
ఆరు వేల యప్పు కారేండ్లు గడిచెను
తీర్చ మనుచు నడుగ తీక్షణముగ
తమ్ము డన్న మధ్య తగవు పుట్టెను వారి
కప్పులోనఁ బుట్టె గద తుఫాను.
తీర్చ మనుచు నడుగ తీక్షణముగ
తమ్ము డన్న మధ్య తగవు పుట్టెను వారి
కప్పులోనఁ బుట్టె గద తుఫాను.
ఆటవెలది:
అల్ప పీడనమ్మె యధికమై చెలరేగె
వాయు గుండ మాయె వార్ధి లోన
అవని ఇల్లు గాగ నాకసమే కప్పు
కప్పులోనఁ బుట్టె గద తుఫాను.
వాయు గుండ మాయె వార్ధి లోన
అవని ఇల్లు గాగ నాకసమే కప్పు
కప్పులోనఁ బుట్టె గద తుఫాను.
No comments:
Post a Comment