తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday 20 June 2012

కంచెయే చేను మేయుట కల్ల గాదు


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - కంచెయే చేను మేయుట కల్ల గాదు

తేటగీతి: 
కన్న బిడ్డను కడ తేర్చు కన్నతల్లి
శిష్యు రాండ్రను కామించి చెరచు గురువు 
ప్రజల సొమ్మును గాజేయు ప్రభుత; చూడ 
కంచెయే చేను మేయుట కల్ల గాదు.

2 comments:

కమనీయం said...

ఆర్యా,మీ పూరణ చాలా బాగున్నది .అభినందనలు.
'కాల మహిమయొ మరి యేమొ కాని,నేడు,
రక్షణము జేయువారలె భక్షణమ్ము
చిత్రముగ జేయ నిక యేమి చేయగలము?
కంచెయే చేను మేయుట కల్లగాదు.

గోలి హనుమచ్చాస్త్రి said...

కమనీయంగారూ! ధన్యవాదములు. చక్కనిపూరణ చేశారు. అభినందనలు.