తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday 23 May 2012

అచ్చతెనుంగు పద్యమున నాంగ్లపదంబులె శోభఁ గూర్చురా.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - అచ్చతెనుంగు పద్యమున నాంగ్లపదంబులె శోభఁ గూర్చురా.

ఉత్పలమాల: 
ముచ్చట గొల్పు తెల్గు యిది మోముకు శోభయె మాటలాడ,నీ
కిచ్చిన లడ్డు మీద గన 'కిస్మిసు కాజు' పసందు గూర్చుగా
మెచ్చగ వచ్చు దాని రుచి మిన్నగ జేసెడు 'వర్డ్శ్ ' వాడగన్ 
అచ్చతెనుంగు పద్యమున నాంగ్లపదంబులె శోభఁ గూర్చురా. 

4 comments:

Zilebi said...

పిల్లవాడు పలికిన బంగారం
మా గొలీ వారి చేయి బడిన
అచ్చతెనుంగు పద్యమున
నాంగ్లపదంబులె శోభఁ గూర్చురా

చీర్స్
జిలేబి

Zilebi said...

గోలీ వారి పదజాలమున ఏ భాషా పదమైనా చేయి తిరుగును
గోలీ వారు కష్ట తరమైన వర్డ్ వెరిఫికేషన్ తీసివేసిన బ్లాగు శోభగూర్చును
వారి కిస్మిసు వర్ద్స్ వర్త్, వారి కాజు కత్లీ, వారి
అచ్చ తెనుంగు పద్యమున నాంగ్ల పదంబులె శోభ గూర్చురా !

చీర్స్

జిలేబి.

కమనీయం said...

మీ పద్యం చాలా బాగుంది.నిజమే.తెలుగు లడ్డూ మీద ఇంగ్లిష్ జీడి,కిస్మిస్ బాగుంటాయి కాని లడ్డూయే ఇంగ్లిష్ ఐతే యేం బాగుంటుంది ?

గోలి హనుమచ్చాస్త్రి said...

జిలేబీ గారూ! తీయని వ్యాఖ్యలతో కిస్మిస్ కాజూలు పొదిగిన లడ్డూ రుచిని పొగడిన మీకు ధన్యవాదములు.

కమనీయం గారూ! నిజమే లడ్డూ స్వభావాన్ని మార్చకుండా రుచిని పెంచే విధంగా ఉంటేనే పైపై హంగులను స్వీకరించాలి.ధన్యవాదములు.