తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday 22 May 2012

పదములు లేనట్టివాఁడు పరుగులు వెట్టెన్.


శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.

సమస్య - పదములు లేనట్టివాఁడు పరుగులు వెట్టెన్.

కందము: 
ఉదయము గుడిలో చోరుడు
పదిమందికి దొరుక చేసె బడితెల పూజన్ 
పదపడి మ్రొక్కుచు పలుకగ
పదములు లేనట్టి వాఁడు పరుగులు వెట్టెన్. 

1 comment:

Anonymous said...

ఎన్నికల కాలంబున బీరాలు పోయె
ప్రజసేవయే మాధవ సేవయని ముదంబున
ఎన్నికలు గెలువంగ ప్రజలు నిలదీయ
పదములు లేనట్టివాడు పరుగు లు వెట్టెన్