తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday 20 May 2012

యితఁడేనా? యితఁడా? యితండ? యితఁడా? యీతండ? యీతండటే?

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  06-07-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.


సమస్య - యితఁడేనా? యితఁడా? యితండ? యితఁడా? యీతండ? యీతండటే?


పెద్దవాడైన శ్రీ కృష్ణుని జూచి వ్రేపల్లె వాసులు ఆశ్చర్యంతో ...

మతిపోయెన్ మన కృష్ణు జూడ , గతమున్ మాయింట పాల్వెన్నలన్
జత గాళ్ళందర గూడి దొంగిలి, కనన్ జారేను గా పిల్లిలా !
పతి లోకంబుల కాయె నేడు కనగా , బాలుండు పాలుండయెన్ !
యితఁడేనా? యితఁడా? యితండ? యితఁడా? యీతండ? యీతండటే?

1 comment:

వెంకట రాజారావు . లక్కాకుల said...

గోలి వారూ ,
బావుందండీ మీ పురణ . ఆరోజున నేను పూరించిన పద్యం .....

ఇతడేనా?మన విష్ణునందనుడు?రాశీభూత పాండిత్య మం
డిత సాహిత్యసుధా సుధాకరుడితండేనా? ఘనున్ శంకరున్
స్తుతిసంభావితు జేసి క్రొత్త పధముల్ సూత్రించు విద్యావిదుం
డితడేనా?యితడా?యితండ?యితడా?యీతండ?యీతండటే?

--- వెంకట రాజారావు . లక్కాకుల

--- బ్లాగు:సుజన సృజన
డా.విష్ణునందన్ గారి పద్యం ఆనాటి పూరణలలో హైలైట్ .వారిని ప్రశంసిస్తూ చెప్పిన పూరణ నాది .స్మృతికి తెచ్చినందుకు ధన్యవాదములు .