తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday 12 February 2012

కపిని కళ్యాణ మాడెను గౌరి కొడుకు

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04-06-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


  సమస్య -  కపిని కళ్యాణ మాడెను గౌరి కొడుకు


కందము : 

గౌరి పెద్దన్న పేరేమొ కనకరాజు
'కనక' మామయ్య పిల్లను 'కపి ' యటంచు 
నాట పట్టించి ఏడ్పించు నాత డిపుడు
'కపిని' కళ్యాణ మాడెను గౌరి కొడుకు. 

4 comments:

Unknown said...

సమస్యకు తగ్గ పూరణం

గోలి హనుమచ్చాస్త్రి said...

భావ రాజు గారూ ! బ్లాగును వీక్షించి మీ భావమును వ్యక్తము చేసినందులకు ధన్యవాదములు.

కమనీయం said...

ఛాయచిత్రము నందున చక్కదైన
బాలికను జూపి సమ్మతి బడసి ,వేరు
పాపనున్ గట్టబెట్టిరి రూపమందు
కపిని కళ్యాణమాడెను గౌరికొడుకు.
--------------

గోలి హనుమచ్చాస్త్రి said...

కమనీయం గారూ ! కపిని ' కట్టబెట్టిన' మీ పూరణ బాగుంది.అభినందనలు.