తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Thursday 19 January 2012

కవిని పెండ్లి యాడి కాంత వగచె.

కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16-05-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


          సమస్య -  కవిని పెండ్లి యాడి కాంత వగచె.

 ఆట వెలది: 

కలికి కూర లడుగ కంద పద్యము జెప్పు
పాత్ర లడుగ సీస పద్య మిచ్చు
పూల నడుగ నుడువు పూని చంపకమాల
కవిని పెండ్లి యాడి కాంత వగచె. 

2 comments:

అక్షర మోహనం said...

manchi poorana..padyamallina KAVIki jejelu

గోలి హనుమచ్చాస్త్రి said...

'అక్షర మోహనం' గారూ!సుస్వాగతం... బ్లాగును వీక్షించి మెచ్చుకోలు నిచ్చి నందులకు ధన్యవాదములు.తరచుగా మీ వీక్షణలను ఆకాంక్షించు చున్నాను..