తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday 12 December 2011

బలరాముడు సీతజూచి ఫక్కున నవ్వెన్

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 29-10-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


         సమస్య - బలరాముడు సీతజూచి ఫక్కున నవ్వెన్

కం:  అల కృష్ణు కన్న యెవ్వరు ?
        కల ఫలితము నెవరి జూచి కదిపెను త్రిజటే ?
        చెలి చక్కలి గిలి కేమనె ?
        బలరాముడు - సీతజూచి - ఫక్కున నవ్వెన్ ! 

2 comments:

Anonymous said...

భావం కూడా తెలియచేయండి. ప్లీజ్

గోలి హనుమచ్చాస్త్రి said...

అయ్యా అజ్ఞాత గారూ ! భావమేముంది. మూడు ప్రశ్నలు - మూడు సమాధానాలు. అంతే...