తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday 26 November 2011

రాముఁడు ముదమున ఖురాను చదివె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-08-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                    సమస్య - రాముఁడు ముదమున ఖురాను చదివె

ఆ.వె:  రామ దాసు బట్టి రాజు తానీషాయె
          బాధ పెట్టె తాను బంది ఖాన

          ప్పు తీర్చి దాసు గొప్పతనము జెప్ప
          రాముఁడు, ముదమున ఖురాను చదివె. 

1 comment:

Disp Name said...

యదా యదా హి గ్లానిర్భవతి భారతస్య అన్న ఆ పరంధాముడు ,

అన్ని మతములకూ ఆర్డర్ ఇచ్చే,

ఓ ముల్లా భారతము చదివె
ఓ జాను భాగవతము చదివే
ఓ రాముడు ఖురాను చదివే
సమానో మనః సహ చిత్తమేషాం
సమాని వ ఆకూతిహి
సమానా హృదయానివాహ

అని వారలు గ్రహించే !