తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday 7 November 2011

నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్ను

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 24 - 06 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                  
                      సమస్య - నిన్ను నిన్ను నిన్ను నిన్నునిన్ను

ద్రౌపదిని పాండవులైదుగురు పెండ్లి చేసుకునే సమయంలో వ్యాసుడు వచ్చి వారి సందేహాన్ని తీర్చిన సందర్భం ....

ఆ.వె:  పూర్వ జన్మ మందు శర్వుని పూజించి
          అడిగె తానుగ ' పతి ' నైదు మార్లు
          నాటి వరము వలన నాతి చేకొను నేడు
          నిన్ను నిన్ను నిన్ను నిన్ను నిన్ను.

2 comments:

కమనీయం said...

సంధి చేసికొనుడు సమరస భావాన
బంధు నాశనమ్ము పాడి కాదు
భీమసేనుడొకడె పీచ మడచ గల్గు
నిన్ను,నిన్ను, నిన్ను,నిన్ను, నిన్ను.

గోలి హనుమచ్చాస్త్రి said...

ఆర్యా ! కమనీయం గారూ ! మీ పూరణలు కమనీయముగా నుంటూ యున్నవి. పోస్టు పైన నేను చూపిన తేది ప్రకారము శంకరాభరణం బ్లాగున మీ పూరణలు ఉంచినచో మిత్రుల పూరణలతో మీవి కుడా ఉండగలవు. నేను కూడా గత పూరణలు అలగే చేశాను.