తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday 2 November 2011

దత్తపది - అల, కల, వల, నెల - రామాయణార్థంలో

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 - 06 -2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


           దత్తపది  - అల, కల, వల, నెల -  రామాయణార్థంలో

       
        అశోక వనంలో సీతతో త్రిజట పలికిన ఊరడింపు మాటలు..

కం:  కలతను జెందకు మమ్మా!
        అల రాఘవు డిటకు వచ్చి యసురుల జంపున్ !
        వలపుల రాణివి నిన్నే
        నెలతా! తాగొని జనునిక నిజమిది వినుమా ! 

1 comment:

కమనీయం said...

కలకంఠి యీ విధి వగవ
వలదమ్మా కల్లకాదు ,అల శౌర్యోన్నతుడై
నెల లోన వచ్చి కాచును
ఇల నెవ్వారడ్డమైన నినకులమణి నిన్ .