తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday 29 October 2011

దత్త పది - "బాబూమోహన్ - బ్రహ్మానందం - కోట - ఆలీ"

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 22-09-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


         దత్త పది - "బాబూమోహన్ - బ్రహ్మానందం - కోట - ఆలీ"
                   విషయము:- పచ్చదనము పరిశుభ్రత.


ఆ.వె: తులసి కోట నింట తెలిసి పెంచగ వలె
         బాబు! మోహనమ్ము పచ్చ చెట్లు
         చుట్టు పట్ల పెంచ శోభనమా లీ
         బ్రహ్మ నందన నుతు భార్య నిలచు.

బ్రహ్మ నందన (నారద ) నుతుని(నారాయణుని ) భార్య (లక్ష్మి) తాండవిస్తుందని నా భావం.  

3 comments:

కమనీయం said...

తులసికోటను దాటుచు దోగియాడు
బాబు మోహను గని తన ఆలి తోడ
మగడు పలికె బ్రహ్మానంద మాయె మనకు
ముద్దులొల్కెడి పాపని మోము చూడ.

గోలి హనుమచ్చాస్త్రి said...

కమనీయం గారూ! చక్కని పూరణ. అభినందనలు.రెండవ పాదంలో యతి సరిచూడాలి.

కమనీయం said...

శాస్త్రి గారూ,ధన్యవాదాలు,సరిగా చూసుకోలేదు.ఈవిధంగా సవరిస్తున్నాను.

బాబు మోహను గని యాలి భర్త బిలిచి
యనెను మనకు బ్రహ్మానంద మాయెనదిగొ