తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday 22 October 2011

దత్తపది - కంటే-వింటే-తింటే-ఉంటే

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 14-09-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


దత్తపది -  కంటే-వింటే-తింటే-ఉంటే రామాయణార్థంలో ఐచ్ఛిక ఛందస్సులో

            
మంధర కైక తో అన్న మాటలు...

 
కం:  వింటే! కైకా జెప్పెద
        కంటే నీకొడుకు భరతు ఘన పాలకుగా
        నుంటే తప్పే మున్నది
        తింటే నీ యుప్పు నేను, తెలిపితి వినుమా!
 

1 comment:

కమనీయం said...

వింటే శుభ వార్తలనున్,
కంటే సీతామతల్లి కరుణామయినిన్
తింటే మధుర ఫలమ్ముల
ఉంటే సుఖముగ మహాత్మ ఓ హనుమంతా.
--------