తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday 17 October 2011

రతి పతి సోదరుండు రతి రాజుగ వెల్గెను.....

శ్రీ చింతా రామకృష్ణారావు  గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 08-09-2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

         
                  సమస్య -  రతి పతి సోదరుండు రతి  రాజుగ వెల్గెను చిత్రమున్నదే

             ఒక పడతి తన చెల్లి 'రతిని' తన మరదికి జోడు కూర్చి మురియు సందర్భం ...

చం: అతి సుకుమారి యీలలన యల్లన సాగిన హంసలేడ్చుగా !
       అతనిని జూడ చుక్కలవి యాకస మందున నుండ నేర్చునా !
       హితముగ జోడు గూర్ప మరి హెచ్చెను శోభలు; నాదు చెల్లెలౌ
       రతి - పతి సోదరుండు; ' రతి, రాజుగ' వెల్గెను చిత్రమున్నదే? 

 

3 comments:

చింతా రామ కృష్ణా రావు. said...

హనుమచ్ఛాస్త్రి వదాన్య! మీ కవిత లాహాహా! యనన్ దివ్యమై
మనమందున్ మహనీయమై నిలుచునే! మాన్యాత్మ! దైవంబు మీ
కనయంబున్ వశమై శుభంబు గొలుపన్ గావ్యాత్మ స్పష్టంబు కా
ననుసంధానము చేసి పద్యములనాయాసంబుగా కూర్తురే!

గోలి హనుమచ్చాస్త్రి said...
This comment has been removed by the author.
గోలి హనుమచ్చాస్త్రి said...

చింతా వారికి నమస్కారములు. ఆర్యా!

కంటిరి మీరీ ' బ్లాగునె '
అంటిరి పద్యములను గని, ' అహహా ' యని, వె
న్నంటిన మీ యాశీస్సులె
' అంటిని వెలుగిచ్చు ననుచు' నార్యా ! ప్రణతుల్ !