శ్రీ చింతా రామకృష్ణారావు గారు "ఆంధ్రామృతం" బ్లాగునందు 30-08-2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - సూర్యుఁడు, చంద్రుఁడుం బొడమె చుక్కలు పెక్కులు నిక్కుచుండగన్
ఉ: కార్యము దగ్గరాయె నని కాంతలు కన్నెలు వేగ వచ్చి కైం
కర్యము చేయ, దేవళము కాంతులు చిమ్మగ మ్రుగ్గు పెట్టగన్
పర్య వసానమిద్ది, యట బాగగు రంగుల చుక్క మ్రుగ్గులో
సూర్యుఁడు, చంద్రుఁడుం బొడమె చుక్కలు పెక్కులు నిక్కుచుండగన్.

No comments:
Post a Comment