శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 04 - 2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య - ఆవకాయ రుచుల నతివ రోసె
ఆ.వె: ఆవకాయ పెడుదు నత్తగారికి పోటి!
చూడు డనుచు పెట్టి,చూచె రుచిని
మొదట తాను;నాడు మొదలు ముట్టననుచు
ఆవకాయ రుచుల నతివ రోసె!
సమస్య - ఆవకాయ రుచుల నతివ రోసె
ఆ.వె: ఆంధ్ర పడుచు వచ్చె నమెరికా నుండిటు
అత్త గారి గ్రామ మచట జూడ
ఆవకాయ రుచుల, నతివరో!సెహబాసు
ఆహ!ఆహ! యనుచు నారగించె!
అత్త గారి గ్రామ మచట జూడ
ఆవకాయ రుచుల, నతివరో!సెహబాసు
ఆహ!ఆహ! యనుచు నారగించె!
ఆ.వె: ఆవకాయ పెడుదు నత్తగారికి పోటి!
చూడు డనుచు పెట్టి,చూచె రుచిని
మొదట తాను;నాడు మొదలు ముట్టననుచు
ఆవకాయ రుచుల నతివ రోసె!
No comments:
Post a Comment