తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday 5 September 2011

శంకరాభ(పూ)రణం - నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్ ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.


    సమస్య - నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్


కం:  వినువీధుల వెదకితి మిము
       కనుగొన;సప్తర్షులార! గాలి ప టంలా
       ఘనముగ నుండగ జూచితి
       నిను నిను నిను నిన్ను నిన్ను నిన్నును నిన్నున్! 

           నా, నానా  ' ' కార పద్యం 

కం
:     నీ నాన్నే నన్ననెనా?
         నేనే నీ నాన్న నైన నిన్ననినానా?*
       *నీ నాన్నన్నను నేనే!
        నానీ!నీ నాన్న నాన్న నానాన్నేనే
!
 

*(నిన్న+అనినానా)
*(
నీ నాన్న+అన్నను) 

1 comment:

Anonymous said...

డియర్ శాస్రి గారూ...న కారము పైన చాలా విన్నాము కానీ పద్యము చూడడము ఇదే.గమ్మత్తుగా వుంది...శ్రీనివాస్