తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday 28 August 2011

శంకరాభ(పూ)రణం - పరుని పైన సాధ్వి మరులు గొనెను ....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                   సమస్య :  పరుని పైన సాధ్వి మరులు గొనెను

ఆ.వె :  కంటనీరు బెట్ట కలుములు గలుగవు,
           మహిళ లన్న మహిని మాతృ సములు;
           అన్న భావనున్న ఆత్మనాధు, దయా
           పరుని పైన;సాధ్వి మరులు గొనెను. 

2 comments:

కమనీయం said...

ఓరగంట జూచి యువతీలలామ
పెండ్లి చూపులందు పెద్దలడుగ
వరుని చంద్ర వదను వల్లభు సద్గుణ
పరుని జూచి సాధ్వి వలచె మదిని

గోలి హనుమచ్చాస్త్రి said...

శ్రీ "కమనీయం " గారికి నా బ్లాగునకు స్వాగత పూర్వక నమస్కారములు. కమనీయమైన పూరణను చేసినారు. శంకరాభరణం బ్లాగునకు కవి మిత్రునిగా రాగలరని ఆశించుచున్నాను.
'కమనీయమైన' శారదా దేవి వర్ణ చిత్రముతో 'కనువిందు' చేయుచున్న మీ బ్లాగు చూచినాను. పలు విషయములను పద్య, గద్య , కవితా రూపములలో పలు విధములుగా చెప్పుచున్న విధము కమనీయముగా నున్నది. తరచూ వీక్షణలను, అమూల్య వ్యాఖ్యలను కోరుతూ ....