తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Saturday 13 August 2011

శంకరాభ(పూ)రణం - కవులు నియమములకు గట్టు బడరు....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 01- 04 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                      సమస్య :  కవులు నియమములకు గట్టు బడరు

ఆ.వె: గణము,ప్రాస,యతులు,కట్టుబాటులు కొన్ని
          పద్య కవిత లందు పరిఢవిల్లు!
         వచన కవిత లందు, భావ కవిత లం
దు
         కవులు నియమములకు గట్టు బడరు!  

4 comments:

Anonymous said...

నిండుగ బూతు మాటలు
చూడగ మరిఎన్నొద్వంద్వార్థములున్

ధనముకోసమె వ్రాసెడి సినీ
కవులు నియమము లకు కట్టు బడరు

శ్రీనివాస్

గోలి హనుమచ్చాస్త్రి said...

శ్రీనివాస్ గారూ ! చక్కటి పూరణకు భావాన్నిచ్చారు.
మీ భావానికి పద్య రూపం ...చిత్తగించండి..

రెచ్చ గొట్టు నట్టి రెండర్థముల తోడ
బూతు మాటలెన్నొపోత పోసి
పాట లమ్ము కొనుచు వ్రాసెడి సినిమాల
కవులు నియమము లకు కట్టు బడరు

Anonymous said...

శాస్త్రి గారూ

ఈ సారి పద్యము వ్రాయడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదములు

గోలి హనుమచ్చాస్త్రి said...

శ్రీనివాస్ గారూ! సంతోషం ..మీ పద్యం కోసం ఎదురు చూస్తుంటాను....