శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 18 -03 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : సింహము నెదిరించి గ్రామ సింహము గెలిచెన్
కం : సింహళ జట్టును జూడగ
సింహమె క్రిక్కెట్టునందు, చిన్నది కెన్యా !
'సంహౌ'గెలిచిన - అనెదము
సింహము నెదిరించి గ్రామ సింహము గెలిచెన్!!
సమస్య : సింహమును జయించెను గ్రామ సింహ మొకటి
తే.గీ : బొమ్మ కథలను వేసెడు పొత్తమందు
"కండ బలము నధిగమించఁ గలదు తెలివి"
అనుచు చెప్పెడు కథ గంటి, నందులోన
సింహమును జయించెను గ్రామ సింహ మొకటి.
No comments:
Post a Comment