శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 04 -03 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య: మడిగట్టిన శ్రోత్రియుండు మద్యము ద్రాగెన్.
సమస్య: మడిగట్టిన శ్రోత్రియుండు మద్యము ద్రాగెన్.
కం: 'గుడిగంట ' నాటకంబున
గుడిలో పూజారి పాత్ర 'గోపడు 'వేసెన్!
సడి లేక మధ్య మధ్యన
మడిగట్టిన శ్రోత్రియుండు మద్యము ద్రాగెన్!!
కం: చెడు తిరుగుడు తిరిగెడు యొక
గుడి అర్చకు చిన్న కొడుకు, కూడలి నడువన్
పడి పడి నవ్వి జనులనిరి
"మడిగట్టిన శ్రోత్రియుండు మద్యము ద్రాగెన్."
No comments:
Post a Comment