శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 02 -03 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : హర,హర,శంకరా,యనుచు నాలిని కౌగిట జేర్చె బ్రేమతో.
ఒకప్పుడు భార్యపై శంకతో కొట్టిన భర్త తప్పు తెలుసుకొని చేరదీసిన సమయంలో
అన్న మాటలు.అతనికి హరా! అనటం అలవాటు.
చం: కొరకొర జూచి కొట్టితిని కోపము తోడను శంకతో, హరా!
చరచర ఈడ్చినాను నిను చావిడి బైటకు నాడు, నేటితో
పొరలవి వీడి పోయినవి పొల్పుగ, నీయెడ యెంచనెప్పుడున్
హర!హర! శంక; రా!యనుచు నాలిని కౌగిట జేర్చె బ్రేమతో.

No comments:
Post a Comment