శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 28 -02 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య : భీముడు భీష్ము జంపెనతి భీకరలీల జగమ్ము మెచ్చగన్
సమస్య : భీముడు భీష్ము జంపెనతి భీకరలీల జగమ్ము మెచ్చగన్
ఉ:రాముని శిష్యు డప్పుడు పరాక్రమమొప్పగ పోరు సల్పగా
నేమియు పాలువోక మరి యెట్టుల జచ్చునొ తాత జెప్పగా
భీముని తమ్ముడర్జునుడు వ్రేల్చె శిఖండిని ముందు నిల్పి, ఏ
భీముడు భీష్ము జంపెనతి భీకరలీల జగమ్ము మెచ్చగన్?
No comments:
Post a Comment