తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Sunday 26 June 2011

శంకరాభ(పూ)రణం - దత్తపది : పూరి - వడ - దోశ - అట్టు.

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 -06-2010 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ  
  

                   దత్తపది :  పూరి, వడ, దోశ, అట్టు - మహాభారతార్థంలో......


                       శ్రీ కృష్ణుడు అర్జునునకు చేసిన హిత బోధ...

తే.గీ :  సమరమందున వలెనదో శక్తి యుక్తి !
          వడలి పోకుమ ! చేయుము వారి వధను!
          పూరి గరచునె కౌంతేయ ! పులియు సహజ
          ధర్మ మట్టులె విడనాడి? ధర్మ మిదియె! 

2 comments:

Anonymous said...

పూరి,ధోస, అట్టు ను తిన్న పిదప మీ యొక్క శంకరాభరణపు మూడురెండ్లు పూరణలు పూర్తవుతున్న శుభ సందర్భములొ మీకు అభినందనలు...శ్రీనివాస్ హైదరాబాద్.

గోలి హనుమచ్చాస్త్రి said...

శ్రీనివాస్ గారూ! మాపద్యములను రుచి జూసి మెచ్చుకొను చున్నందుకు మీ రసజ్ఞతకు ధన్యవాదములు.