తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Monday 13 June 2011

శంకరాభ(పూ)రణం - మాతృ భాషాభిమానమ్ము మనకు వద్దు .....

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 21-02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                                  సమస్య: మాతృ భాషాభిమానమ్ము మనకు వద్దు.


తే.గీ:   తమిళ తమ్ముళ్ళ తపనను తలచుకొనుము,
           మాతృ భాషాభిమానమ్ము మనకు ముద్దు
           నల్ల ముఖమును వేయకు; తెల్ల వారి
           మాతృ భాషాభిమానమ్ము మనకు వద్దు.

తే.గీ:   తెలుగు భాషను బలుకగ తెగులటంచు
           ఆంగ్ల భాషను నేర్వగ నాత్ర పడుచు
           తేనె వదలుదు వదియేల? తెల్ల వారి 
           మాతృ భాషాభిమానమ్ము మనకు వద్దు. 

1 comment:

Rajasekhara Sarma said...

రాయల కాలం నాటి దేశభాషలందు తెలుగులెస్స అన్న మాటను మరల గుర్తుకు తెచ్చిన శాస్త్రి గారికి ధన్యవాదములు