శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 14 -02 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య: తల్లిని దండించువాడు ధన్యుడు గదరా
కం: తల్లీ! తండ్రీ! అనుచును
పిల్లల ప్రేమించుచుంద్రు పెద్దలు కానీ
అల్లరి మించిన, తండ్రిని
తల్లిని, దండించువాడు ధన్యుడు గదరా!
కం: పిల్లలు, ఎవరైతేనేం ?
పిల్లను, అది ఆడదైన, పిండమునాడే
ఒల్లక హత్యను జేసే
తల్లిని, దండించువాడు ధన్యుడు గదరా!
కం: తల్లిగ జూడక , కోడలి
నొల్లకనే చంపివేసి నల్లిగ నెంచే
కిల్లర్, వర్రెస్టు మహా
తల్లిని, దండించువాడు ధన్యుడు గదరా!
నొల్లకనే చంపివేసి నల్లిగ నెంచే
కిల్లర్, వర్రెస్టు మహా
తల్లిని, దండించువాడు ధన్యుడు గదరా!
No comments:
Post a Comment