తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Tuesday 24 May 2011

శంకరాభ(పూ)రణం - మాఘమందున స్నానమ్ము మరణ మొసగు ...

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 -02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.
           



 సమస్య: మాఘమందున స్నానమ్ము మరణ మొసగు


తే.గీ.  బద్ధకమునకు మరి భవ బంధములకు
        మాఘమందున స్నానమ్ము మరణ మొసగు
        మాఘ మాసపు పూజల మహిమ వలన
        శ్రీహరి దయను కోరిన సిరులు గలుగు.

3 comments:

komibaruva said...

శాస్రి గారికి నమస్కారములు

ఇంతకు ముందు 'ఖర నామము సుతునకొసగె కడు మోదమునన్
'

అను పూరణము పోస్తు చేసాను


దానికి మీ సమాదానమునకు మరియు సలహాకు నా ధన్యవాదములు


'బ్రహ్మ చారి భార్య పరమ సాధ్వి అనే
సమస్యకు

ఆ.వె ' ఎవని భార్య సాధ్వి అని కొందలపడగ
నాదు భార్య కాదు నాదు భార్య
యనిన ఒక్కడనియె అందరికన్నను
బ్రహ్మ చారి భార్య పరమ సాధ్వి


మొదటి పాదము లో యతి లోపాన్ని దయచెసి సరిచేయండి

గోలి హనుమచ్చాస్త్రి said...

కోమలరావు గారూ!ఇది ఈమధ్య శంకరాభరణం బ్లాగులో ఇచ్చిన సమస్య- చక్కగా పూరించారు.మీరు నిస్సంకోచంగా ఆ బ్లాగున పూరణలు చేయవచ్చు.లోపాలుంటే మాస్టరుగారు సరిచేసి సూచనలిస్తారు.మీ పూరణలోని చిన్న లోపాన్ని సరిచేశాను.అభిప్రాయము తెలుపగలరు.ధన్యవాదములు.

ఆ.వె: ఎవని భార్య సాధ్వి,ఎరుక పరచుడన్న,
నాదు భార్య, కాదు నాదు భార్య
యనిన, ఒక్కడనియె; అందరికన్నను
బ్రహ్మ చారి భార్య పరమ సాధ్వి!

komibaruva said...

మీకు నా ధన్యవాదములు