శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 -02 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య: రంగవల్లి యుద్ధరంగ మయ్యె.
ఆ.వె: మంత్రగాడు యొకడు మంచి మ్రుగ్గులు వేసి
దయ్యము నట జేర తాను బిలిచె
భూత మాంత్రి కునకు భూతమ్మునకుగూడ
రంగవల్లి యుద్ధరంగ మయ్యె.
సమస్య: రంగవల్లి యుద్ధరంగ మయ్యె.
ఆ.వె: 'రంగ ' డడిగె వంద రమ్మును త్రాగంగ
ఒల్ల ననియె భార్య 'వల్లి ' యపుడు
ఊరి వారి నడుమ పూరి గుడిసె ముందు
రంగ-వల్లి, యుద్ధ రంగ మయ్యె.
ఒల్ల ననియె భార్య 'వల్లి ' యపుడు
ఊరి వారి నడుమ పూరి గుడిసె ముందు
రంగ-వల్లి, యుద్ధ రంగ మయ్యె.
ఆ.వె: అతివలంత గూడి ఆవూరి కూడలి
మ్రుగ్గు లేసి తాము మురియుచుండ,
తంద నాలనాడ త్రాగుబోతులు వచ్చి
రంగవల్లి యుద్ధ రంగమయ్యె.
మ్రుగ్గు లేసి తాము మురియుచుండ,
తంద నాలనాడ త్రాగుబోతులు వచ్చి
రంగవల్లి యుద్ధ రంగమయ్యె.
ఆ.వె: మంత్రగాడు యొకడు మంచి మ్రుగ్గులు వేసి
దయ్యము నట జేర తాను బిలిచె
భూత మాంత్రి కునకు భూతమ్మునకుగూడ
రంగవల్లి యుద్ధరంగ మయ్యె.
No comments:
Post a Comment