శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 07 -02 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య: భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె
తే.గీ: భార్య కోపము చల్లార్చ భర్త యొకడు
భామ యలుకదీర్పగ పట్టె పాదములను
కృష్ణు కంటెను మనమేమి గొప్ప యనుచు
భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె!
సమస్య: భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె
తే.గీ: మెట్టెలను నెటతొడుగు చేపట్టు వాడు?
కోర్కెనెట్టుల పరమేశు కోరవలయు?
ఇంతి గర్భమ్ము దాల్చిన నెవరు మురిసె?
భార్య పాదంబులకు - మ్రొక్కి- భర్త మురిసె.
కోర్కెనెట్టుల పరమేశు కోరవలయు?
ఇంతి గర్భమ్ము దాల్చిన నెవరు మురిసె?
భార్య పాదంబులకు - మ్రొక్కి- భర్త మురిసె.
తే.గీ: భార్య కోపము చల్లార్చ భర్త యొకడు
భామ యలుకదీర్పగ పట్టె పాదములను
కృష్ణు కంటెను మనమేమి గొప్ప యనుచు
భార్య పాదంబులకు మ్రొక్కి భర్త మురిసె!
No comments:
Post a Comment