శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 06 -02 -2011 న ఇచ్చిన సమస్యకు నా పూరణ.
సమస్య: చేయవలయు గురువు శిష్య పూజ.
ఆ.వె: చిన్ననాటి తనదు శిష్యుండు యొకనికి,
ప్రీతి పుత్రి నిచ్చి పెండ్లి చేయ;
వరుడు యతడు గాన,గురువు నేననకను
చేయవలయు గురువు శిష్య పూజ!
సమస్య: చేయవలయు గురువు శిష్య పూజ.
ఆ.వె: "లక్ష్మి పూజ నిపుడు లక్షపూవులతోడ
చేయవలయు" గురువు "శిష్య! పూజ
కొరకు తగిన పూలు కొనితెమ్ము" అనిచెప్ప
సంత కేగి తేగ సంతసించె!
చేయవలయు" గురువు "శిష్య! పూజ
కొరకు తగిన పూలు కొనితెమ్ము" అనిచెప్ప
సంత కేగి తేగ సంతసించె!
ఆ.వె: చిన్ననాటి తనదు శిష్యుండు యొకనికి,
ప్రీతి పుత్రి నిచ్చి పెండ్లి చేయ;
వరుడు యతడు గాన,గురువు నేననకను
చేయవలయు గురువు శిష్య పూజ!
ఆ.వె: ఆబ్దికదినమునకు, అవసరార్ధమువచ్చె
శిష్యు డొకడు గురువు చెప్పగానె,
భోక్త యతడు, గాన భక్తితో తప్పక
చేయవలయు గురువు, శిష్య పూజ!
శిష్యు డొకడు గురువు చెప్పగానె,
భోక్త యతడు, గాన భక్తితో తప్పక
చేయవలయు గురువు, శిష్య పూజ!
ఆ.వె: శిష్యుడేగురువుకు చెప్పక తనకుతా
చేయవలయు; గురువు శిష్య పూజ
గాని, దక్షిణలను గాని యిమ్మనుచును
కోరడెపుడు;గురువు గొప్ప వాడు!
చేయవలయు; గురువు శిష్య పూజ
గాని, దక్షిణలను గాని యిమ్మనుచును
కోరడెపుడు;గురువు గొప్ప వాడు!
No comments:
Post a Comment