తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Wednesday 4 May 2011

శంకరాభ(పూ)రణం - దున్న హరిని జూచి సన్నుతించె

శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 05-02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.

                   సమస్య:  దున్న హరిని జూచి సన్నుతించె   

ఆ.వె:  కావుమనుచు నాడు గజరాజు వేడగా,
          పరుగు పరుగునేగి  ప్రాణములను,
          రక్షజేసి నిలువ  లక్ష్మితో;  తనముం
          దున్న హరిని జూచి సన్నుతించె.

ఆ.వె:  మాఘమాసమందు మహిలోన హరిజూడ,
          తీర్థ యాత్ర కొరకు తిరుపతి జని;
          వేంకటేశురూపు వెలుగుచున్న,  తనముం
          దున్న హరిని జూచి సన్నుతించె.

1 comment:

komibaruva said...

ఆ.వె ఏడరా హరియని దేవారి కంబము

మోద,కేసరి నర రూపము గని

భయము గొన్న బాలుడప్పుడా కంబమం

దున్న హరిని జూచి సన్నుతించె