తేనె రుచిని జూడ తీయదనము లేదు--------------------చెరకు రసపు తీపి చెల్లుబాటుగ లేదు ---------------------- పటిక బెల్లమందు పసయె లేదు---------------------------మధురమాయె పద్య మదియె నాకు------------------

Friday 29 April 2011

శంకరాభ(పూ)రణం - ఖరనామము సుతున కొసగె ....

    శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 03 -02 -2011 న ఇచ్చిన  సమస్యకు నా పూరణ.          

               సమస్య : ఖరనామము సుతున కొసగె కడుమోదమునన్


          కం:  ధరలో నొక్కడు, గలిగిన
               వరపుత్రునిచూచి, తలచి వైయ్యస్సారున్;
               'హరి హర రాజ జగన్ శే
               ఖర ' నామము; సుతున కొసగె కడుమోదమునన్.

2 comments:

komibaruva said...

కం . సరుకులు తెమ్మని తన కొమ
రుని సంతకు పనిచిన సరకుగొనని కొడుకున్
ఒరి ‘గాడిద కొడకా’ అని
ఖర నామము సుతునకొసగే కడుమోదమునన
డా.కోమలరావు
krbaruva.blogspot.com

గోలి హనుమచ్చాస్త్రి said...

కోమల రావు గారూ! సంతోషం
చిన్న చిన్న దోషములున్ననూ పద్యరచనకై చేసిన మీ ప్రయత్నం అభినందనీయము.మీ రచన కొనసాగించండి.
తరచు బ్లాగు వీక్షణలో కలవాలని కోరుతూ .. ధన్యవాదములు

మీ పూరణకు నా సవరణ.

సరుకులు తెమ్మని తన సుతు
గురుమూర్తిని పనిచిన సరకు గొనని కొడుకున్
అరె!‘గాడిద కొడకా’! అని
ఖర నామము సుతునకొసగె కడుమోదమునన్!